తిరుమలలో పెను ప్రమాదం జరిగింది. తిరుమలలోని రెండవ ఘాట్ రోడ్డులో కారు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారులో నుంచి చెలరేగాయి మంటలు. ఈ తరుణంలోనే వెంటనే కారులో నుంచి దిగి పారిపోయారు భక్తులు. దింతో పెను ప్రమాదం తప్పింది.

రెండు రోజుల వ్యవధిలో రెండు కార్లు దగ్ధమయ్యాయి. ఇక రెండవ ఘాట్ రోడ్డులో కారు ప్రమాదంపైఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న తిరుమల శ్రీ స్వామివారిని భక్తుల సంఖ్య 78,821 మంది దర్శించుకున్నారు. స్వామివారికి భక్తుల సంఖ్య 33,568 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.36 కోట్లుగా నమోదు ఐంది. అటు సర్వదర్శనానికి అన్ని కంపార్టమెంట్లు నిండి బయట క్యూ లైన్ లో వేచిఉన్నారు తిరుమల శ్రీ వారి భక్తులు. SSD టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.