మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మూడవరోజు సిబిఐ విచారణ ముగిసింది. నేడు దాదాపు 6 గంటల పాటు అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు సిబిఐ అధికారులు. నిందితులతో అవినాష్ రెడ్డి జరిపిన లావాదేవీలపై ఆయనను సిబిఐ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇక రేపు మరోసారి విచారణకు రావాలో, వద్దో అన్నదానిపై నేడు రాత్రికి అవినాష్ రెడ్డికి తెలియజేస్తామన్నారు సిబిఐ అధికారులు.
ఇక ఇదే కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ ల కస్టడీ విచారణ మరికాసేపట్లో ముగియనుంది. వివేకా హత్యకు దారి తీసిన కారణాలు, హత్యకు గురైతే గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారనే దానిపై విచారణ సాగినట్లు తెలుస్తోంది. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు అవినాష్ రెడ్డి ఈనెల 25వ తేదీ వరకు సిబిఐ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే విచారణ ఎన్ని రోజులు చేస్తారనేది సీబీఐ ఇష్టం.