రాజకీయ ఉద్దేశాలే వివేకా హత్యకు ప్రధాన కారణం : సీబీఐ

-

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్​పై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరుగుతోంది. నేడు సీబీఐ తరఫున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అనిల్‌ వాదనలు వినిపిస్తున్నారు. ‘‘అవినాష్ రెడ్డి విచారణకు సహకరించకుండా కేసు దర్యాప్తులో మొదటినుంచీ అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. దర్యాప్తు మా పద్ధతి ప్రకారం చేస్తాం కానీ.. అవినాష్ కోరుకున్నట్లు కాదు. నోటీసు ఇచ్చిన ప్రతిసారీ ఏదో ఒక కారణం చెప్పి విచారణకు హాజరుకావడం లేదు. కోర్టుల్లో రకరకాల పిటిషన్లు వేస్తూ అవినాష్ జాప్యం చేస్తున్నారు’’ అని సీబీఐ తనఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

వివేకా హత్యకు అనేక ఉద్దేశాలు చెబుతున్నారని.. ప్రధాన కారణమేంటి? అని సీబీఐ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై సీబీఐ స్పందిస్తూ.. ‘‘రాజకీయ ఉద్దేశాలే వివేకా హత్యకు ప్రధాన కారణం. హత్యకు నెల రోజుల ముందు నుంచే కుట్ర ప్రారంభమైంది. కడప ఎంపీ టికెట్ విజయమ్మ లేదా షర్మిలకు ఇవ్వాలని వివేకా అడిగారు. వివేకాపై రాజకీయంగా పైచేయి సాధించాలని అవినాష్ భావించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి వెనక కుట్ర జరిగింది. అవినాష్‌ రాజకీయంగా శక్తిమంతుడైతే వివేకాను చంపాల్సిన అవసరం ఏంటి?’’ అని కోర్టుకు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version