BREAKING : గండిపేట యూనియన్ బ్యాంక్ పై అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం

-

BREAKING : హైదరాబాద్‌ లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గండిపేట యూనియన్ బ్యాంక్ పై అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పై అంతస్తులో ఉన్న లాప్ టాప్ ప్యాకింగ్ కార్యాలయంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి.

దీంతో ఆ భవనం లో భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. ఇక ఆ మంటలను చూసి పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు స్థానికులు. దీంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది… మంటలను ఆర్పుతోంది.

యూనియన్ బ్యాంక్ కు వ్యాపించకుండా జాగ్రత్త పడుతున్నారు నార్సింగీ పోలీసులు. ఇక కార్యాలయం లో ఎవ్వరూ లేకపోవడం తో పెను ప్రమాదం తప్పింది. అయితే.. దట్టమైన పొగ వ్యాపించడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు స్థానికులు. మొదటి అంతస్తు, రెండోవ అంతస్తులో ఉన్న లాప్ టాప్, డెస్క్ టాప్స్ దగ్ధం అయింది. అటు యూనియన్ బ్యాంక్ ను మూసి వేశారు అధికారులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version