రాజమహేంద్రవరం-అనకాపల్లి జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

-

రాజమహేంద్రవరం-అనకాపల్లి జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి 16 పరిధిలోని అనకాపల్లి-అన్నవరం-దవాన్ చెరువు కిలోమీటర్లు 741.255 నుంచి కిమీ 903.000 సెక్షన్ లో నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసల రహదారిగా విస్తరింపజేయడానికి వివరణాత్మక ప్రాజెక్ట్ ను సంబంధిత కన్సల్టెంట్ కు అందజేశారని తెలిపారు.

అదేవిదంగా జాతీయ రహదారి 40లో రాయచోటి-కడప కిమీ 211/500 నుంచి 217/200 సెక్షన్ లో నాలుగు వరుసల రహదారి టన్నెల్ నిర్మాణం 2024-25 సంవత్సరం వార్షిక ప్రణాళికలో చేర్చబడిందని.. టన్నెల్ నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు అవసరం ఉన్నందున అటవీ శాఖ నుంచి అలైన్మెంట్ అనుమతులు వచ్చిన తరువాత టన్నెల్ తో కూడిన నాలుగు వరుసల రహదారి నిర్మాణ ప్రతిపాదనలు చేపట్టడం జరుగుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లేఖలో పేర్కొన్నారని ఎంపీ రమేష్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version