ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు యాక్షన్ చూస్తుంటే దానవీరశూరకర్ణలో ఎన్టీఆర్ నటనను మించి పోయారని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏపీ బడ్జెట్ పై ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు దిగి పోయే నాటికి 3లక్షల 13వేల కోట్ల అప్పు ఉంది. బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ తో అబద్దపు ప్రచారం చేశారు. ఒక్కోక్కరూ ఒక్కోమాట చెప్పారు. 6లక్షల 46కోట్లు మాత్రమే ఉందని మీరే చూపించారు.
చంద్రబాబు 14లక్షల కోట్ల అప్పు అంటారు. అది ఎక్కడిది అని ప్రశ్నించారు. ఓ పద్దతి ప్రకారం.. మాపై గోబెల్స్ ప్రచారం చేశారు. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.6లక్షల 46వేల కోట్లు ఉందని జగన్ చెప్పారు. ఈ లెక్కలన్ని కూడా బడ్జెట్ లో కూటమి ప్రభుత్వమే చూపించింది. గతంలో అప్పు రత్న అని దత్తపుత్రుడు పేర్కొన్నారు. అప్పు రత్న అనే బిరుదు ఎవ్వరికివ్వాలని ప్రశ్నించారు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దిన వైసీపీ ప్రభుత్వానికి పిలిచి అవార్డు ఇవ్వాలన్నారు జగన్.