చంద్రబాబు అరెస్ట్ తప్పనిసరి పరిణామం – విడదల రజిని

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు రాష్ట్ర మంత్రి విడదల రజిని. చంద్రబాబు అరెస్ట్ తప్పనిసరి పరిణామం అన్నారు. చంద్రబాబు లా పరిధి దాటి ఉన్న వ్యక్తిలా అనుకుంటున్నారని.. ప్రభుత్వ ధనాన్ని దుర్మార్గంగా దోచుకున్నారని ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ లో ఇది తొలి అరెస్ట్ కాదని.. ఇప్పటికే అనేకమంది అరెస్టు అయ్యారని తెలిపారు. ఈ స్కామ్ లో అనేకమంది పాత్ర ఉందన్నారు విడదల రజిని.

కేబినెట్ నిర్ణయానికి, అగ్రిమెంట్ కి, చెల్లింపులకు అసలు పొంతనే లేవన్నారు. చంద్రబాబు ప్రభుత్వ సొమ్ముని దారుణంగా దోచుకున్నారని మండిపడ్డారు. ఇక ఎంపీ నందిగాం సురేష్ మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో చంద్రబాబు తన స్కిల్ చూపించాడని ఎద్దేవా చేశారు. స్కాం లో వాటాలు పంచుకున్న వాళ్లంతా తెగ బాధపడుతున్నారని.. బావ కళ్ళల్లో ఆనందం కోసం పురందేశ్వరి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version