తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే.. ఆంధ్రలో 100 ఎకరాలు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు. ఒకప్పుడు ఆంధ్రలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో నాలుగు ఎకరాలు కొనేవారు.. అదే ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రలో 50 నుండి 100 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందన్నారు చంద్రబాబు. దీనికి కారణం ఎవరని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు.
తిరుమల వెంకన్నకు అపచారం…జగన్ కు శిక్ష తప్పదని హెచ్చరించారు చంద్రబాబు. తిరుమల శ్రీవాణి ట్రస్టుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల వెంకన్నకు అపచారం తలపెడుతున్నారు… శ్రీవాణి ట్రస్టు నిర్వహించేది ఎవరు..?అని నిలదీశారు. శ్రీవాణి టిక్కెట్లకు రసీదులు ఇవ్వడం లేదని.. రసీదులు ఇవ్వకుండా తీసుకుంటున్న డబ్బులు ఏమవుతున్నాయి..? అని నిప్పులు చెరిగారు.