వాలంటీర్లకు చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చారు. అధికారంలోకి రాగానే వాలంటీర్లకు చంద్రబాబు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వం పేపరు కొనుగోలు నిమిత్తం మంజూరు చేసిన అలవెన్స్ లను రద్దు చేసింది. పత్రికా కొనుగోలు ఉత్తర్వులను రద్దు చేస్తూ తాజాగా మోమో జారీ చేసింది. న్యూస్ పేపర్లు కోసం ఎలాంటి చెల్లింపులు జరపవద్దని ఆదేశించింది.
ఇప్పటికే పించన్ల పంపిణీకి సచివాలయ ఉద్యోగులను రంగంలోకి దించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రేషన్ కార్డులు ఉన్న వారికి జులై నుంచి రాగులు పంపిణీ చేస్తామని పౌరసరఫరాల శాఖ తెలిపింది. ప్రస్తుతం రాయలసీమలో మాత్రమే వీటిని పంపిణీ చేస్తుండగా.. మిగతా జిల్లాలకు విస్తరించనుంది. మూడు కేజీల బియ్యానికి బదులుగా రాగులు పంపిణీ చేస్తారు. అలాగే సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లా ప్రజలకు జులై నుంచి జొన్నలు కూడా అందివ్వనున్నారు.