చంద్రబాబు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మెగా డీఎస్సీతో పాటు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించిన టెట్ లో పాస్ కానీ వారు, తాజాగా B. ED, D. ED పూర్తి చేసిన వారి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
జులై ఒకటిన నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. మొదట టెట్ నిర్వహించి, ఆ తరువాత డీఎస్సీ ప్రిపరేషన్ కు 30 రోజుల సమయం ఇవ్వనున్నట్లు సమాచారం. మరో వైపు నిన్నటి ఏపీ కేబినెట్‌లో పెన్షన్ల పెంపు అంశంపై చర్చ జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జులై 1 నుంచి పెంచిన పెన్షన్లు అమలు చేయాలని నిర్ణయించారు. రూ.3వేల నుంచి రూ.4వేలకు పెన్షన్ల పెంపును ఆమోదించారు. ఏప్రిల్ నుంచి ఉన్న పెన్షన్ బకాయిలు రూ. 3 వేలను ప్రభుత్వం చెల్లించనుంది. దీంతో వచ్చే నెలలో ఒకేసారి రూ.7వేలను 65 లక్షల మంది లబ్ధిదారులు అందుకోనున్నారు.