చంద్రబాబు పట్ల తనకు సంపూర్ణ గౌరవం ఉందని, ప్రస్తుతం రాజకీయాల్లో ఆయనే పెద్ద వారని విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానంద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమకు ఎవరితోనే విబేధాలు లేవని తాము స్వాములం, పీఠాధిపతులమని నిత్యం ధర్మం కోసమే పోరాడతామని అన్నారు. ఎవరికి భయపడో తాము ప్రెస్మీట్ పెట్టట్లేదని వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరలో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కానీ స్వరూపానంద ఎప్పుడూ ఒకేలా ఉన్నాడని అన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీశైలంలోని శివాజీ గోపురానికి ఉత్తరాయణ పుణ్యకాలంలో కుంభాభిషేకం చేయకూడదని చెప్పింది తనేనని గుర్తు చేశారు. కానీ, కోర్టులను కూడా మేనేజ్ చేసి కార్యక్రమాన్ని జరిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా సింహాచలంలో చందనోత్సవంలో పొరపాట్లను ఎత్తిచూపానని పేర్కొన్నారు. తిరుమల అన్నదానం విషయంలో తాను అభ్యంతరం వ్యక్తం చేశానని తెలిపారు. చంద్రబాబు అంటే తమకు గౌరవం ఉందని, ఆయన హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వారి కుటుంబ బాగుండాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ పరిధిలోని ఉన్న టీడీడీ పాలన ఇకనైన సక్రమంగా జరగాలని ఆశీర్వదించడానికే ప్రెస్మీట్ ఏర్పాటు చేశామని తెలిపారు.