లోక్ సభలో ఎంపీగా కొనసాగడంపై మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఒకే పార్టీ నుంచి ఒకే వ్యక్తి మూడోసారి ప్రధానమంత్రి కావటం అనేది ఒక చరిత్ర అన్నారు. 1962 తర్వాత మూడవసారి ఒకే పార్టీ నుండి ఒకే వ్యక్తి ప్రధాని కావడం చాలా అరుదైన విషయం అని గుర్తు చేశారు. దేశప్రజలు అంతా తమ ఆత్మను ఆవిష్కరించి ఓట్లు వేశారని ఈటల అన్నారు. బీజేపీ పార్టీ 2014లో, 2019లో చేసిన అభివృద్ధికి ప్రజలు ఎంతగానో సంతోషించి మూడవసారి కూడా అధికారం అప్పజెప్పారన్నారు.
దేశంలోనే పెద్ద నియోజక వర్గమైన మల్కాజ్ గిరి నుండి దాదాపు నాలుగు లక్షల మెజారిటీతో నన్ను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రాష్ట్రంలో మంత్రిగా కొనసాగినప్పటికీ, కేంద్ర ప్రభుత్వంతో కలిసి మోదీ నాయకత్వంలో లోక్సభలో ఎంపీగా కొనసాగడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. దేశంలోని పేదరిక నిర్మూలనకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈటల తెలిపారు.