ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇకపై వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందుబాటులోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందట చంద్రబాబు నాయుడు సర్కార్. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో కలెక్టర్ల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా పౌర సేవల విషయంలో మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరో పది రోజుల్లో ఈ సేవలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటన చేశారట మంత్రి నారా లోకేష్. ప్రస్తుత డిజిటల్ యుగంలో డాక్యుమెంట్లు, ధ్రువపత్రాల కోసం ఆఫీసులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ ద్వారా పౌర సేవలు తీసుకురాబోతున్నారట. ఇక చంద్రబాబు సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఏపీ ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.