రాజమండ్రి నుంచి న్యూఢిల్లీ… ప్రారంభమైన విమాన సర్వీస్..టైమింగ్స్‌ ఇవే !

-

ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది కేంద్ర సర్కార్‌. రాజమండ్రి నుంచి న్యూఢిల్లీ… ప్రారంభమయ్యాయి విమాన సర్వీసులు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి న్యూఢిల్లీ కి నేరుగా విమాన సర్వీస్ ప్రారంభం కావడం జరిగింది. ఇవాళ్టి నుంచే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. న్యూఢిల్లీ నుంచి రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న మొదటి ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్ అందుబాటులోకి వచ్చింది.

Direct flight between Delhi- Rajahmundry from today

ఈ తరుణంలోనే… తొలి విమాన సర్వీసులో ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు , రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వచ్చారు. రన్ వే పై ల్యాండ్ అయిన ఇండిగో ఎయిర్ బస్ కు వాటర్ కెనాల్స్ తో స్వాగతం పలికారు ఎయిర్ పోర్ట్ సిబ్బంది. రాజమండ్రి – ఢిల్లీ ఫ్లైట్ ప్రారంభోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇక ఈ ఫ్లైట్ ఉదయం 6.30 గంటలకు ఢిల్లీ నుంచి ఏపీకి.. 9.30 ఏపీ నుంచి ఢిల్లీకి వెళుతుందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version