BREAKING: వైసీపీ పార్టీకి అవంతి శ్రీనివాస్‌ రాజీనామా లేఖ !

-

Avanti Srinivas letter of resignation to YCP party: వైసీపీ పార్టీకి బిగ్‌ షాక్‌ ఇచ్చారు అవంతి శ్రీనివాస్‌. వైసీపీ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖ కూడా విడుదలు చేశారు అవంతి శ్రీనివాస్‌. వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గుడ్ బై చెప్పారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌.

Avanti Srinivas letter of resignation to YCP party

కొంత కాలంగా పార్టీతో అంటీముట్టనట్టుగా అవంతి శ్రీనివాస్‌ ఉంటున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో భీమిలి నుంచి గెలిచి మంత్రి అయ్యారు అవంతి శ్రీనివాస్‌. వైసీపీ హయంలో పర్యాటక శాఖ మంత్రిగా పని చేశారు అవంతి శ్రీనివాస్‌. వైసీపీ ఏపీలో ఓడిన ఇలాంటి నేపథ్యంలో అవంతి పార్టీ వీడిట్టంపై చాలా కాలంగా ప్రచారం జరిగింది. అయితే.. వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. జనసేన, లేదా బీజేపీలోకి వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version