గంటాను బాబే వెళ్ళిపోవాలని చెప్పారా…?

-

మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం పై అనేక అనుమానాలు వస్తున్నాయి. పార్టీ ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉన్నా సరే ఆ పార్టీలో చాలా వరకు నేతలు బయటకు రావడం లేదు. ఎమ్మెల్యేలు కూడా సమర్ధవంతంగా పని చేయకపోవడంతో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా ఎమ్మెల్యేలు పాల్గొనకపోవడంతో పార్టీ ఎక్కువగా ఇబ్బంది పడింది. ఈ నేపధ్యంలో వారు చంద్రబాబు నాయుడుని కలిసే అవకాశం ఉందని తెలుస్తుంది. త్వరలోనే విజయవాడ పర్యటనకు రానున్న చంద్రబాబు నాయుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో సమావేశమై అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విషయంలో కూడా చంద్రబాబు నాయుడు సీరియస్ గా  ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఆయన విషయంలో కూడా త్వరలోనే ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. విశాఖ ఎన్నికల ప్రచారంలో పార్టీ నుంచి బయటకు వచ్చేసినా తనకు ఎటువంటి ఇబ్బందులు లేవు అని చంద్రబాబు నాయుడు స్పష్టం గా చెప్పారట. ఇటీవల గంటా శ్రీనివాసరావు అనుసరించిన వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా తెలుగుదేశం పార్టీలో వినిపించాయి. మరి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది త్వరలోనే స్పష్టత రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version