బాబు ట్వీట్ భజన: కేంద్రానికి రిక్వస్టులు పెరిగిపోతున్నాయి!

-

ఆంధ్రప్రదేశ్ లో పాలన ఎంతో వైవిధ్యభరితంగా దూసుకుపోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిలోనే తొంభైశాతం వరకు సంక్షేమం విషయంలో ప్రజలకు ఇచ్చిన హామాలను నెరవేర్చామని అధికార పార్టీ లెక్కలతో సహా చెప్పుకుటుంది. అదే సమయంలో ప్రతిపక్షానికి ప్రత్యక్ష సాక్ష్యాలను చూసి చెప్పుకోడానికి మరేం లేక ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో అక్కడ మనస్సును కేంద్రీకృతం చేస్తుంది. అలా చేసి, వారికి అనిపించిన ఏ చిన్నపాటి వ్యవహారాన్నైనా కేంద్రం కగలజేసుకోవాలని గగ్గోలు పెడుతుంది.

అయితే చంద్రబాబుకు ఇప్పుడున్న ఆప్షన్స్ రెండింటిలో ఒకటి కోర్టు.. అది బలంగా పనిచేస్తుంది అంటూ తెలుగు తమ్ముళ్లు చంకలు గుద్దేసుకుంటున్నారు! అదే విధంగా ఆ పార్టీ అధినాయకుడు చంద్రబాబు కూడా మరొక మార్గాన్ని కూడా మెల్లిమెల్లిగా తెరుస్తున్నాడు. అదే కేంద్రం బాట పడుతుండటం. “ఏపీ పాలనపై కేంద్రం జోక్యం చేసుకోవాలి” అంటూ కొత్తరాగాన్ని అందుకుంటున్నారు బాబు.

మొన్నటి ఎన్నికల్లో డైరెక్ట్ గా నరేంద్రమోడీ ఓ సన్నాసి అంటూ తిట్టి.. మోడీ అధికారంలోకి రాకూడదని… దేశాన్నంతా ఏకం చేసి తిరిగిన బాబు చివరికి బొక్క బోర్లాపడ్డాడు! దాంతో కేంద్రంలోని బీజేపీ నేతలను చూసేందుకు గజగజ వణికిపోతున్న బాబు.. తన కోటరీలోని ముఖ్యమైన సన్నిహితులను కేంద్ర బీజేపీలో చేర్పించేశారు. అలా వారి ద్వారా రాయబారాలు వంటివి చేయడం మొదలెట్టాడు.

అదేవిధంగా తాజాగా చంద్రబాబు ఏపీలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. వాటి తీరుతెన్నులు.. ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయని చంద్రబాబు ట్వీట్ రూపంలో భజన మొదలెట్టారు. పేలవమైన కరోనా రికవరీ రేటు (9.74)తో జాతీయస్థాయిలో ఏపీ అట్టడుగు స్థాయిలో ఉందని బాబు తెలిపారు. అంతేకాకుండా అత్యధిక యాక్టివ్ కేసుల (11,200) జాబితాలో ఐదోస్థానంలోకి వచ్చేసిందని వెల్లడించారు. అలాగే.. ఫేక్ ఎస్సెమ్మెస్ కరోనా టెస్టుల కుంభకోణం ఈ సంక్షోభాన్ని మరింత ప్రబలం చేసిందని విమర్శించారు. ఇవన్నీ చూపిస్తూ… ఏపీ కరోనా నివారణ చర్యల్లో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు.

మొత్తానికి ఈ మధ్య ఏపీలో జరిగే ప్రతి విషయానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని కొత్తరాగం ఎత్తుకోవడంపై పలువురు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అదేమంటే… బాబు.. పీఎం మోడీని ప్రత్యక్షంగా కలిసి చెప్పుకోవడానికి ముఖం చెల్లకో, మోడీ రానివ్వకో ఇలా ట్వీట్స్ రూపంలో సరికొత్త భజనకు తెరలేపారని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version