ఇవాళ, రేపు ఢిల్లీలోనే పర్యటించనున్న చంద్రబాబు…కారణం ఇదే

-

ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ మధ్యాహ్నాం ఢిల్లీ వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇవాళ, రేపు ఢిల్లీలోనే పర్యటించనున్నారు చంద్రబాబు నాయుడు. ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు షెడ్యూల్‌ కూడా ఖరారు అయింది.

Chandrababu will visit Delhi today and tomorrow

ఇక అటు… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలు ఏర్పాటు చేయడంపై సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. పెట్టుబడుల సాధనే ప్రధాన లక్ష్యంగా దాదాపు ఆరేడు శాఖల్లో కొత్త పాలసీల రూపకల్పనపై కసరత్తు మొదలెట్టింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం. పారిశ్రామిక వేత్తల్లో నమ్మకాన్ని కలిగించి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు విస్తృత ప్రయత్నాలు జరుపుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మరోవైపు ప్రైవేటు సంస్థల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version