KTR apologizes to Telangana women: తెలంగాణ మహిళలకు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్షమాపణలు చెప్పినట్లు అర్థం వచ్చేలా పోస్ట్ వైరల్ గా మారింది. నిన్న బీఆర్‌ఎస్ పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను అంటూ బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదన్నారు. దీంతో తెలంగాణ మహిళలకు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్షమాపణలు చెప్పారని అంటున్నారు. ఇక అటు తెలంగాణ మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు మంత్రి సీతక్క. RTC బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్స్ లు, రికార్డింగ్ డాన్స్ లు చేసుకోవచ్చు అని కేటీఆర్ అత్యంత జుగుప్సకరంగా మాట్లాడారు. మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్..? మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డాన్స్ లు చేస్తున్నారా అని ప్రశ్నించారు.