చంద్రయాన్‌-3 కౌంట్‌డౌన్‌ మొదలు.. రేపు నింగిలోకి..

-

చంద్రయాన్​-3 ప్రయోగానికి కౌంట్​డౌన్​ షురూ అయింది. ఇవాళ మధ్యాహ్నం ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ.. 24 గంటల పాటు కొనసాగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 2:35:13 గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం-3పీ4 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి దీనిని ప్రయోగించనున్నారు. ఆగస్టు 23 లేదా 24న సాఫ్ట్ ల్యాండింగ్ జరిగే అవకాశముందని ఇస్రో ఛైర్మన్ సోమ్​నాథ్ తెలిపారు.

బాహుబలి రాకెట్‌గా గుర్తింపు పొందిన ఎల్‌వీఎం3-ఎం4.. దీన్ని మోసుకెళ్తోంది. చంద్రయాన్‌ సిరీస్‌లో ఇది మూడో ప్రయోగం. ఈ ఉపగ్రహాన్ని ల్యాండర్‌, రోవర్‌ ప్రొపల్షన్‌ మాడ్యూల్‌తో అనుసంధానించారు. సుమారు 3,84,000 కి.మీ. ప్రయాణించి చంద్రుని నుంచి వంద కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి ఇది చేరుకుంటుంది. ఆ తర్వాత జాబిల్లి దక్షిణ ధ్రువంలోని నిర్దేశిత ప్రదేశంలో ల్యాండ్‌ అవుతుందని ఇస్రో తెలిపింది. చంద్రయాన్‌ 2లో ప్రయోగించిన ఆర్బిటర్‌ చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరుగుతోంది. దాన్నే ఇప్పుడు వినియోగించుకోనున్నట్లు ఇస్రో ఇదివరకు వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version