జగన్ కు షాక్… వైయస్ఆర్ రైతు భరోసా పేరు మార్పు చేసింది చంద్రబాబు సర్కార్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరో పథకానికి కూటమి ప్రభుత్వం పేరు మార్చింది. ‘వైఎస్ఆర్ రైతు భరోసా’గా ఉన్న పథకం పేరును ‘అన్నదాత సుఖీభవ’గా మార్పు చేసింది.
దానికి అనుగుణంగా వెబ్ సైట్‌లో మార్పులు చేస్తూ సీఎం చంద్రబాబు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఫొటోలను ఉంచింది. కాగా, ఇప్పటికే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్సార్ పింఛన్ కానుక, వైఎస్సార్ కల్యాణమస్తు పేర్లను మార్చేసిన విషయం తెలిసిందే.
అటు ఆంధ్ర ప్రదేశ్ లో గత ప్రభుత్వం రిషికొండపై కట్టిన భవనాల గురించి వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన నివాసం కోసం 500కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ భవనాలు నిర్మించారని కూటమి శ్రేణులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.ఆ భవనాలు రాష్ట్రపతి, ప్రధాని వంటి విశిష్ట అతిధులు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆతిధ్యం ఇవ్వటం కోసం కట్టిన భవనాలని, ప్రభుత్వ వినియోగం కోసం మాత్రమే ఉద్దేశించి కట్టిన భవనాలని వైసీపీ తెలిపింది.