మంత్రి విడదల రజనీపై చింతమనేని ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు

-

ఏలూరు: వైసిపి మంత్రి విడదల రజనీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. నేడు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు చింతమనేని ప్రభాకర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రి బర్నింగ్ వార్డ్ లో ఏసీలు పని చేయకపోవడంతో ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు చింతమనేని.

“మీ మంత్రిగారు మేకప్ వేసుకుని తిరుగుతున్నారా” అంటూ వైద్య సిబ్బందిని ప్రశ్నించారు చింతమనేని. కలెక్టర్, ఆసుపత్రి సూపరిండెంట్ ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు హయంలో ఎప్పుడు రాని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి..? అంటూ నిలదీశారు. చేతకాకపోతే ఆసుపత్రిని మూసివేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చింతమనేని.

Read more RELATED
Recommended to you

Exit mobile version