రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణంలో ఐదుగురిని అరెస్టు చేసిన సిఐడి

-

రాజధాని అసైన్డ్‌ భూముల కుంభకోణం కేసులో ఐదుగురిని అరెస్టు చేసారు సీఐడీ అధికారులు. కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయలు, కొట్టి దొరబాబు అనే ఐదుగురిని అరెస్టు చేసారు. 1100 ఎకరాల అసైన్డ్‌భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని అభియోగాలు ఉండడంతో వీరిని అరెస్టు చేశారు. ఇందులో 169.27 ఎకరాలకు సంబంధించి విచారణకు సంబంధించి 5 గురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయి మాజీ మంత్రి నారాయణ గా పేర్కొన్నారు.

తన సొంత బంధువులు, పరిచయస్తుల పేరుతో బినామీ లావాదేవీలు జరిపినట్టుగా అభియోగాలు ఉన్నాయి. అనంతవరం, కృష్ణాయపాలెం, కూరగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయుని పాలెం, వెంటకపాలెం గ్రామాల్లో వేర్వేరు సర్వే నంబర్లలో సుమారు 89.8 ఎకరాల భూమిని మాజీ మంత్రి నారాయణ తన బంధువులు, పరిచయస్తుల పేరుతో అక్రమంగా కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.

రామకృష్ణా హౌసింగ్‌ డైరెక్టర్‌ ఖాతాల ద్వారా పేమెంట్లు చేసి ఈ వ్యవహారాలు చేశారని నిర్ధారణ అయింది. ఈ కేసులో ఇతర నిందితులు వారి తరఫు మనుషులు మరో 79.45 ఎకరాల అసైన్డ్‌ ల్యాండ్స్‌ను అక్రమంగా కొనుగోలు చేశారని వెల్లడించారు సిఐడి అధికారులు. ఈ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి నారాయణ – రామకృష్ణా హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మధ్య రూ.15 కోట్ల లావాదేవీలు జరిగాయని నిర్ధారణ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version