మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ కు ఊహించని షాక్ తగిలింది. తాజాగా మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. IRR కేసులో ఈ నెల 11న విచారణకు రావాలని నారాయణ అల్లుడు పునీత్ కి సీఐడీ నోటీసులు జారీ చేసింది. అటు ఇప్పటికే సీఐడీ నోటీసులను సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో పునీత్ పిటిషన్ దాఖలు చేశారు.
సీఐడీ నోటీసులను సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో పునీత్ పిటిషన్ ను నేడు విచారణ చేయనుంది ఏపీ హై కోర్టు. ఇది ఇలా ఉండగా, IRR కేసులో విచారణ నిమిత్తం నేడు తాడేపల్లి సిట్ కార్యాలయానికి రానున్నారు నారా లోకేష్. ఇవాళ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేయనుంది సీఐడీ. IRR కేసులో A 14గా నారా లోకేష్ ఉన్న సంగతి తెలిసిందే.