జ‌గ‌న్ త‌ల్లినీ వ‌ద‌ల‌ని దుష్ప్ర‌‌చారం.. ఇంత దారుణ‌మా…?

-

దుష్ప్ర‌చారం.. త‌మ‌కు న‌చ్చ‌ని ప్ర‌భుత్వంపై, పాల‌కుల‌పై, పార్టీల‌పై, నేత‌ల‌పై కొన్నాళ్లుగా ఏపీలో జ‌రుగుతున్న‌ది ఇదే! తాము మాత్ర‌మే అధికారం చ‌లాయించాల‌ని, త‌మ‌కు మాత్రమే సీఎం సీటు ప‌దిలం కావాల‌ని, త‌ర‌త‌రాలుగా త‌మ‌కే అది ఉండి పోవాల‌ని భావించిన కొంద‌రు నాయకులు.. ప్ర‌స్తుత జ‌గ‌న్ స‌ర్కారుపై నిర్ద్వంద్వంగా చేస్తున్న‌, చేయిస్తు్న్న దుష్ర్ప‌చారం హ‌ద్దులు మీరుతోంది. వాస్త‌వానికి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల మ‌ధ్య వ్య‌తిరేక ప్ర‌చారం ఉండ‌డం ఎక్క‌డైనా మ‌న‌కు తెలిసిందే. అయితే, దీనికి భిన్నంగా ఏపీలో దుష్ర్ప‌చారం సాగుతోంది. సీఎం జ‌గ‌న్‌ను ఎన్నిక‌ల‌కు ముందు ఒక అవినీతి ప‌రుడుగా, నేర‌స్తుడిగా చిత్రించే ప్ర‌య‌త్నం చేశారు.

మాన‌సికంగా ఆయ‌న‌ను కుంగ‌దీసే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌జ‌ల్లో చుల‌కన చేసే ప్ర‌య‌త్నం జోరుగా సాగింది. వార‌స‌త్వంగా సీఎం పీఠం ద‌క్కాలా ? అంటూ.. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఈ దుష్ప్ర‌చార క్ర‌తువులో భాగం అయిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఇలాంటి ప‌రిస్థితిలో మౌనంగా అన్నింటినీ భ‌రిస్తూ.. త‌నేంటో ప్ర‌జ‌ల‌కు నిరూపించారు జ‌గ‌న్‌. అదే ఆయ‌న‌కు పెద్ద బ‌లం అయింది. ఇప్ప‌టికీ ఆయ‌న‌కు, ఆయ‌న కుటుంబానికి ప్ర‌జ‌లే బ‌లం, బ‌ల‌హీనత కూడా! అయితే, ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా ఈ దుష్ర్ప‌చారం వ‌దిలి పెట్ట‌డం లేదు. తాజాగా జ‌గ‌న్ మాతృమూర్తి విజ‌య‌మ్మ‌ను కూడా ఈ దుష్ప్ర‌చారం వ‌దిలి పెట్ట‌లేదు.

ఆమె త‌న భ‌ర్త‌, మాజీ సీఎం, దివంగ‌త వైఎస్ జీవితానికి సంబంధించి `నాలో.. నాతో.. వైఎస్సార్‌` అనే పుస్త‌కం రాసుకున్నారు. వైఎస్ జ‌యంతి సంద‌ర్భంగా ఈ నెల 8న సీఎం జ‌గ‌నే స్వ‌యంగా త‌న త‌ల్లిదండ్రుల జీవిత విశేషాల‌తో కూడిన పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు. అయితే, తాజాగా ఇది పీడీఎఫ్‌ల రూపంలో సోష‌ల్ మీడియాలోకి ఎక్కేసింది. వాస్త‌వానికి ఇది నిజం కాద‌ని, ఇది కూడా దుష్ప్ర‌చారంలో భాగ‌మేన‌ని ఈ కుటుంబానికి బంధువు, వైఎస్ తోడ‌ల్లుడు అయిన వైవీ సుబ్బారెడ్డి ప్ర‌క‌టించారు. నాలో..నాతో..వైఎస్సార్‌’’ పుస్తకం పేరుతో పీడీఎఫ్‌ ఫైల్‌ను సామాజిక మాధ్యమాల్లో సర్క్యూలేట్‌ చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు.

వైఎస్ విజయమ్మ రాసిన పుస్తకానికి, దీనికి సంబంధం లేదని సుబ్బారెడ్డి తెలిపారు. ఎమెస్కో పబ్లిషర్స్‌ అచ్చువేసిన పుస్తకమే అసలైన పుస్తకమని ఆయన స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్‌ అవుతున్న పీడీఎఫ్‌ ఫైల్‌లోని అంశాలు వేర్వేరుగా ఉన్నాయి. దురుద్దేశంతో ఈ పీడీఎఫ్‌ఫైల్‌ను సర్క్యులేట్ ‌చేస్తున్నారు. దీనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొత్తానికి ఈ ప‌రిణామాన్ని గ్ర‌హించిన సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి మేధావుల వ‌ర‌కు కూడా విజ‌య‌మ్మ‌ను కూడా ఈ దుష్ప్ర‌చారం వ‌దిలి పెట్ట‌లేదే! అని బుగ్గ‌లు నొక్కుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version