ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఏపీలో నేటి నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు కొనసాగుతాయి. ఏపీలో పరీక్షా కేంద్రాలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా కల్పించారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3.450 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6 లక్షల 19 వేల 275 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనున్నారు. ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 121 పరీక్ష కేంద్రాలలో 23,189 మంది విద్యార్థులు…పరీక్షలు రాయనున్నారు.
వీరిలో 22,355 మంది రెగ్యులర్ విద్యార్థులు, 834 మంది ఓపెన్ స్కూల్స్ విద్యార్థులు ఉన్నారు. ఒక అబ్జర్వర్, 11 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్, 25 మంది సిట్టింగ్ స్క్వాడ్ పర్యవేక్షణలో 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏర్పాట్లను పూర్తిచేశారు విద్యాశాఖ అధికారులు. అటు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు ఏపీ పోలీసులు.