వైఎస్ జ‌గ‌న్‌ను డ్ర‌గ్ లార్డ్ పాబ్లో ఎస్కోబార్‌తో పోల్చిన సీఎం చంద్ర‌బాబు..!

-

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు. కొలంబియా డ్రగ్ డాన్ పాబ్లో ఎస్కోబార్ తో జగన్ ను పోల్చారు. ఇవాళ అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేసిన అనంతరం మాట్లాడారు సీఎం చంద్రబాబు. ప్రధానంగా మాజీ సీఎం జగన్ పై అటాక్ చేశారు. 2014-2019 వరకు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుందని తెలిపారు. ఢిల్లీలో జగన్ చేపడుతున్న నిరసనను వ్యతిరేకించారు. పాబ్లో ఎస్కోబార్.. కొలంబియా డ్రగ్ లార్డ్ అని.. అతనో నార్కో ఉగ్రవాది అని.. రాజకీయ వేత్తగా మారిన ఆ డ్రగ్ వ్యాపారి.. ఆ తరువాత తన కార్టెల్ తో డ్రగ్స్ ను అమ్ముకున్నట్టు చెప్పారు.

ఆ సమయంలో 30 బిలియన్ల డాలర్లు అర్జించినట్టు వెల్లడించారు. ఆ డ్రగ్ సేల్ విలువ దాదాపు 90 బిలియన్ల డాలర్లు ఉంటుందని వెల్లడించారు చంద్రబాబు. 1976లో తొలిసారి పాబ్లో ఎస్కోబోర్ ను అరెస్టు చేశారని, కానీ 1980లో అతను ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన డ్రగ్ కింగ్ పిన్ గా అవతరించినట్టు తెలిపారు. డ్రగ్స్ అమ్ముతూ ఎవరైనా సంపన్నులు కావచ్చు. కానీ మాజీ సీఎం జగన్ లక్ష్యం ఏంటి అని ప్రశ్నించారు. టాటా రిలియన్స్, అంబానీల కంటే ఎక్కువ సంపన్నుడు కావాలని అలా చేసినట్టు ఆరోపించారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version