కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లెరులో హిడెన్ కెమెరాల వ్యవహరంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ సంఘటన ఉదయం నుంచి వైరల్ కావడంతో… నేరుగా సీఎం చంద్రబాబు నాయుడే రంగంలోకి దిగడం జరిగింది. హిడెన్ కెమెరాల ఫిక్స్ చేశారనే ఆరోపణలపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంత్రి కొల్లు, జిల్లా కలెక్టర్, ఎస్పీలు గుడ్లవల్లేరు వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
కాగా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. లేడీస్ హాస్టల్ బాత్రూమ్‌లో హిడెన్ కెమెరా బయటపడటంతో విద్యార్థినులు రాత్రంతా ఆందోళనకు దిగారు. ఓ యువతి సాయంతో ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ 300 మంది యువతుల వీడియోలు చిత్రీకరించి విక్రయిస్తున్నట్లు సహచర విద్యార్థులు ఆరోపిస్తున్నారు.