ఏపీలో తెలంగాణ తరహా లిక్కర్ పాలసీ?

-

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం తెలంగాణలో ప్రస్తుతం అమలవుతున్న మద్యం పాలసీ విధివిధానాలనే అనుసరించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏపీలో కూడా రిటైల్ మద్యం వ్యాపారాన్ని ప్రైవేటుకే అప్పగించాలని, అందుకోసం రూ.2లక్షల నాన్ రిఫండబుల్ ఫీజును విధించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మద్యం విధానాలపై కమిటీ అధ్యయనం చేయగా.. సెప్టెంబరులో మద్యం విధానం ఖరారుతో పాటు దరఖాస్తులు స్వీకరించి లైసెన్సులు అందజేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతా సవ్యంగా జరిగితే అక్టోబర్ 1 వరకు ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలులోకి రానుంది.

గతంలో వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీపై తీసుకున్న నిర్ణయాలపై తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ప్రస్తుతం ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకురావాలని భావించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు గతంలో తెచ్చిన మద్యం బ్రాండ్లను కూడా చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో వినియోగదారుల అభీష్టం మేరకు అన్ని బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.గత ప్రభుత్వం మద్యం ధరలు భారీగా పెంచి అప్రతిష్టను మూటగట్టుకోగా.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం రీజనబుల్ ధరలకే అందించనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version