కాంగ్రెస్ పార్టీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

-

గురువారం రోజు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశంలో ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబు మంత్రులతో చర్చించారు. మనం మంచి ఉద్దేశంతో మాట్లాడినా దానిని చెడుగా చిత్రీకరించేందుకు కొన్ని శక్తులు ఎదురు చూస్తూ ఉంటాయని అన్నారు చంద్రబాబు.

గతంలో తాను వ్యవసాయం దండగ అని అనలేదని.. కానీ అన్నట్లు కొంతమంది ప్రచారం చేశారని అన్నారు. ఇప్పుడు ఢిల్లీలో అమిత్ షాపై కూడా ఇదే ప్రచారం సాగుతుందని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. అసలు అంబేద్కర్ ఓడిపోయిందే కాంగ్రెస్ హయాంలోనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అంబేద్కర్ కి గౌరవం దక్కలేదని వ్యాఖ్యానించారు.

ఇక ఏపీలో తాజా పరిణామాలు, మంత్రుల పనితీరు, ఇతర అంశాలపై మాట్లాడిన చంద్రబాబు.. పలువురు మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు టెక్నాలజీని సరిగ్గా వాడుకోవడం లేదని అన్నారు. మంత్రి దగ్గరికి ఏదైనా ఫైల్ వెళితే అది ఎంత సేపు పెండింగ్ లో ఉంటుందో తనకు తెలుసని చెప్పుకొచ్చారు. అంతేకాదు మంత్రుల పనితీరును తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు వారికి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version