ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

-

సాధారణంగా నవంబర్ 01న గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంది. దీంతో వైసీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని కూడా జరుపుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. తాజాగా సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఈదుపాలెంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. నవంబర్ 01వ తేదీ అంటే గుర్తుకొచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం.

ఆ మహానియుడు ఆత్మ త్యాగం చేయడం ద్వారా మనకు రాష్ట్రం సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. ఆయన పేరుతో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెట్టింది తానేనని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు ప్రారంభించింది అక్టోబర్ 19, 1952 రోజున ఆమరణ నిరహార దీక్ష ప్రారంభించారు. గాంధీ మార్గంలో దీక్ష చేశారు. డిసెంబర్ 15, 1952న పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశాడు. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణం అర్పించిన వ్యక్తి పొట్టిశ్రీరాములు.. అది చూసిన తరువాత రాష్ట్రమంతా ఉప్పెన లేస్తే.. అప్పుడు నెహ్రుగారు ఆలోచించి అక్టోబర్ 01, 1952 రోజున ఆంధ్ర రాష్ట్రం ప్రకటించారు. డిసెంబర్ 19, 1952 ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిందని ప్రకటించారు. 1956 ఆంధ్రరాష్ట్రం-తెలంగాణ రాష్ట్రం రెండు కలిపి నవంబర్ 01, 1956 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. జూన్ 02, 2014న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయాయి. పొట్టి శ్రీరాములు ఆత్మార్పన చేసుకున్న డిసెంబర్ 15న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు సీఎం చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version