మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మెగా డీఎస్సీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇస్తాంమన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. పాఠశాలలు ప్రారంభమయ్యే లోపు టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి.

మూడు నాలుగేళ్లలో అమరావతిని గాడిలో పెడతాం. రాజధాని నిర్మాణం జరిగితే ఉపాధి పెరుగుతుంది. పోలవరం పనులు వేగంగా సాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే నీటి సమస్యలు తీరుతాయి’ అని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు.