ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ఒబెరాయ్ హోటల్ లో బిల్ గేట్స్ ను కలవనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక ఇవాళ మధ్యాహ్నం 1.30 వరకు అరగంట పాటు బిల్ గేట్ ఫౌండేషన్ చేపట్టనున్న నూతన కార్యక్రమాల గురించి చర్చించనున్నారు.

బిల్ గేట్ ఫౌండేషన్ రాష్ట్రంలో అమలు చేయనున్న కార్యక్రమ ఒప్పందం అనంతరం 2 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకుని అమరావతికి రానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.