నేడు గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఉండనుంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా తాడికొండ మండలం పొన్నెకల్లులో ఆయన విగ్రహానికి నివాళులర్పించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు చంద్రబాబు..
అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద చదువుతున్న విద్యార్థులతో సీఎం వర్చువల్ సమావేశం జరుగనుంది. అనంతరం పీ-4 కార్యక్రమంలో పాల్గొని మార్గదర్శి-బంగారు కుటుంబీకులతో సమావేశం కానున్నారు చంద్రబాబు నాయుడు. కాగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో కృషి చేద్దామన్నారు. అంబేద్కర్ కలలుకన్న సమ సమాజాన్ని సాధించు కుందాం అని ఎక్స్ లో చంద్రబాబు పోస్ట్ పెట్టారు.