ఈ నెల 17, 18వ తేదీల్లో చంద్రబాబు విదేశీ పర్యటన ఉండనుంది. కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లనున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఒకవేళ రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభానికి ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఖరారు అయితే విదేశీ పర్యటన వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఈ నెల 20న ఏపీ సీఎం చంద్రబాబు జన్మదినం ఉంది.

కాగా, నేడు గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఉండనుంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా తాడికొండ మండలం పొన్నెకల్లులో ఆయన విగ్రహానికి నివాళులర్పించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు చంద్రబాబు..అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద చదువుతున్న విద్యార్థులతో సీఎం వర్చువల్ సమావేశం జరుగనుంది. అనంతరం పీ-4 కార్యక్రమంలో పాల్గొని మార్గదర్శి-బంగారు కుటుంబీకులతో సమావేశం కానున్నారు చంద్రబాబు నాయుడు.