రేపు హర్యానాకు సీఎం చంద్రబాబు..!

-

ఆంధ్రప్రదేశ్  సీఎం నారా  చంద్రబాబు నాయుడు రేపు హర్యానా లో పర్యటించనున్నారు. నయాబ్ సింగ్ సైనీ  హర్యానా ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఆయన ఆహ్వానం మేరకు ఈ ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు హజరుకానున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు సీఎం
చంద్రబాబు విజయవాడ ఎయిర్ పోర్ట్  నుంచి బయలుదేరి, 11 గంటలకు చంఢీఘర్ చేరుకుంటారు.

మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య పంచకుల, సెక్టార్ 5లోని దసరా గ్రౌండ్ కి చంద్రబాబు వెళ్తారు. ఈ క్రమంలో అక్కడ నిర్వహించిన నయాబ్ సింగ్ సెనీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత రాత్రి 10 గంటలకు అక్కడి నుంచి సీఎం చంద్రబాబు బయలుదేరి విజయవాడకు చేరుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version