ఏపీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కొందరి వ్యవహార శైలి పూర్తిగా పోలీస్ శాఖతో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తోంది. తాజాగా ఏపీలో మరోసారి పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. సీఎం కాన్వాయ్ కోసం అంటూ ప్రైవేటు వాహనాన్ని తీసుకెళ్లడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ ఘటనపై సీఎం జగన్ కూడా సీరియస్ అయ్యారు. సీఎం కాన్వాయ్ కోసం అంటూ తిరుమల కు వెళ్తున్న ఓ కుటుంబాన్ని ఆపి వాహనాన్నా తీసుకెళ్లిన ఉదంతంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చేసిన వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు.
పోలీసుల ఓవరాక్షన్ పై సీఎం జగన్ ఆగ్రహం… వాహనం తీసుకెళ్లడంపై చర్యలకు ఆదేశం
-