సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. ఈ నెల 27 నుంచి ఇడుపులపాయ నుంచి ప్రారంభంకానుంది బస్సుయాత్ర. పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా ప్రొద్దుటూరు చేరుకోనుంది బస్సుయాత్ర. ప్రొద్దుటూరులోనే సీఎం జగన్ తొలి బహిరంగ సభ ఉంటుంది. 28న నంద్యాల, 29న కర్నూలు, 30న హిందూపురంలో బస్సుయాత్ర, బహిరంగ సభలు ఉంటాయి.
ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ఉంటుందని చెప్పారు సజ్జల. 27న ఉదయం ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ దగ్గర జగన్ నివాళి అర్పిస్తారని చెప్పారు. ప్రొద్దుటూరులో జగన్ ‘మేమంతా సిద్ధం’ తొలి బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు సజ్జల.
ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జగన్ బస్సు యాత్ర చేస్తారన్నారు సజ్జల.27న ప్రొద్దుటూరులో వైఎస్ జగన్ తొలి బహిరంగ సభ ఉంటుందని… 28న నంద్యాలలో సీఎం జగన్ బస్సు యాత్ర, సాయంత్రం సభ చెప్పారు. 29న గుడ్ ఫ్రైడే ఆ రోజు సెలవు… ఆ రోజంతా అక్కడే వుంటారు జగన్ గారు అన్నారు. 30న ఎమ్మిగనూరులో సీఎం జగన్ బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు సజ్జల.