భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు ఆమె గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఎయిర్ పోర్ట్ లో ద్రౌపది ముర్ము పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో గన్నవరం పరిసర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పోరంకిలోని ఓ ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్ లో రాష్ట్రపతికి పౌర సన్మానం జరగనుంది. గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని ద్రౌపది ముర్మును సత్కరిస్తారు. ఆ తర్వాత రాజ్ భవన్ లో రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ అధికారిక విందు ఇవ్వనున్నారు.