ఎన్నికల వేళ వైసీపీ నేతలకు సీఎం జగన్ మార్గదర్శకాలు ఇవే

-

సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. ఓవైపు వైఎస్సార్సీపీ, మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎన్నికల్లో తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూలుతో ఇక ప్రచారంపై ప్రధాన పార్టీలన్నీ తీవ్రంగా కసరత్తు చేస్తోన్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలకు సీఎం జగన్ కీలక మార్గదర్శకాలు ఇచ్చారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినందున నాయకులంతా తమ గెలుపు కోసం పకడ్బందీ ప్రణాళిక రచించుకోవాలని సూచించారు. అభ్యర్థులంతా ప్రతి గ్రామ సచివాలయాన్ని సందర్శించి.. ప్రజల ఆశీర్వాదం తీసుకో­వా­లని దిశా నిర్దేశం చేశారు.

వీలైనంత ఎక్కువ మంది ప్రజలను కలిసి సంక్షేమ పథకాలను వివరించాలని అభ్యర్థులకు జగన్ సూచించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 18 పార్ల­మెంటు నియో­జ­కవర్గాల్లో మార్పులు చేశామని తెలిపారు. ఆయా నియోజక­వర్గా­ల్లోని పార్టీ శ్రేణులు, నాయకత్వాన్ని సంఘటిత పరి­చి, వారిని ఏకతాటి­పైకి తీసుకువచ్చి కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పారు. 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు నడవాలని జగన్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version