రాష్ట్ర గవర్నర్‌గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు పుదుచ్చేరి ఎల్జీగా కూడా రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు కట్టబెట్టారు. అంతకుముందు తెలంగాణ గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. రాష్ట్రగవర్నర్ సహా అదనపు బాధ్యతల్లో ఉన్న పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి తమిళిసై సోమవారం రోజున రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసేందుకే తమిళిసై గవర్నర్ పదవులకు రాజీనామా చేసినట్లు సమాచారం. ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపగా తాజాగా ఆమోదం లభించింది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీతో సోమవారం రోజున సమావేశమైన తమిళిసై.. అనంతరం రాజీనామా చేశారు. తమిళనాడుకు చెందిన ఆమె 2019 సెప్టెంబర్ 8న రాష్ట్రానికి గవర్నర్‌గా వచ్చారు. 2021 ఫిబ్రవరి 18నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ప్రజలకు తనపై చూపిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటామని తమిళిసై తెలిపారు.