పేద ప్రజలకు ప్రభుత్వం ఏం చేసినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ఏడుపేనని సీఎం జగన్ మండిపడ్డారు. “దీన్ని ఎక్కడో ఉంటూ ఏపీలో సీఎం ఎక్కడ ఉండాలో నిర్ణయిస్తారట. వీళ్లంతా నాన్ లోకల్స్….అయినా వీళ్ళు చెప్పినట్టే ఏపీ ప్రభుత్వం నడవాలట….. వీరి విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడా వివక్ష, లంచాలు లేకుండా నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు జమచేస్తుంటే ఏడుపే ఏడుపు” అని జగన్ విమర్శలు గుప్పించారు.
అలాగే పలాస సభలో పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. “ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తా అని తెలంగాణలో డైలాగ్ లు కొట్టాడు ఈ ప్యాకేజీ స్టార్…. మ్యారేజి స్టార్. ఆంధ్రకు వ్యతిరేకంగా ఆయన కొట్టిన డైలాగులకు తెలంగాణలో పడిన ఓట్లు ఎన్నో తెలుసా? అక్కడ ఇండిపెండెంట్గా నిలబడ్డ నా చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా ఈ దత్తపుత్రుడి పార్టీకి రాలేదు. డిపాజిట్లు కూడా దక్కలేదు” అని జగన్ ఎద్దేవా చేశారు.