పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు సీఎం జగన్. ఇవాళ విజయవాడ నుంచి రాయలసీమకు వెళ్లి… కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు సీఎం జగన్. ఇక అంతకు ముందు పులివెందుల బహిరంగ సభలో పాల్గొన్నారు సీఎం జగన్. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
పులివెందులపై కీలక ప్రకటన చేశారు సీఎం జగన్. నా ప్రాణానికి ప్రాణమైన నా సొంత గడ్డ పులివెందుల అని వెల్లడించారు సీఎం జగన్. పులివెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ అని స్పష్టం చేశారు. పులివెందుల బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ..పులివెందులలో అభివృద్ధికి మార్పునకు మూలం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణం అన్నారు.