రాబోయే ఎన్నికల్లో ఏదైనా పొరపాటు జరిగితే…నేను రాజకీయాలలో ఉండే పరిస్థితి ఉండదు – జగన్‌

-

రాబోయే ఎన్నికల్లో ఏదైనా పొరపాటు జరిగితే…నేను రాజకీయాలలో ఉండే పరిస్థితి ఉండదంటూ ఏపీ సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతం లో ఖజానా లో డబ్బులన్నీ జన్మభూమి కమిటీ లకు కొన్ని మీడియా సంస్థల కు దత్త పుత్రుడిని వెళ్ళేవని.. మన ప్రభుత్వం లో నేరుగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి వేస్తున్నామని వెల్లడించారు.

మంచి చేశాం ,మీకు మంచి జరిగితే నాకు తోడు ఉండండి…మీ బిడ్డకు భయం లేదు..మీ ఆశీస్సులు ఉండాలని కోరారు. కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని… చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కరువు కచ్చితంగా వస్తుందని తెలిపారు. గతం లో వైఎస్సార్ పాలన లో కుడాసమృద్ది గా వర్షాలు పడేవి… రైతులు సుభిక్షం గా ఉన్నారని… మంచి మనసు తో పరిపాలన చేస్తే దేవుడు కూడా కరుణిస్తాడని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version