ఏపీకి IPL జట్టు ఉండాలి.. అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

-

IPL.. ఈ మూడక్షరాలకు ఇండియాలో ఉన్న క్రేజే వేరు. ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు పిల్లల నుంచి పండు ముసలివారి వరకు టీవీలకు అతుక్కుపోతారు. ఇక తమ ఫేవరెట్ టీమ్స్​పై సరదాగా బెట్లు కూడా పెడుతుంటాయి. ఐపీఎల్​కు ఉన్న క్రేజ్ చూసి భవిష్యత్​లో ఏపీ నుంచి ఒక ఐపీఎల్ టీం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో క్రికెట్‌ ఆటకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) మార్గనిర్దేశం చేయనుందని వెల్లడించారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో క్రీడలు, యువజన సర్వీసుల శాఖపై సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు. ‘రాష్ట్రంలో మూడు క్రికెట్‌ మైదానాలను క్రికెట్‌ శిక్షణ కార్యక్రమాల కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌కు అప్పగిస్తాం. అంబటి రాయుడు, కేఎస్‌ భరత్‌ లాంటి వారు రాష్ట్ర యువకులకు స్ఫూర్తిదాయకం. క్రికెట్‌ జట్టు తయారీకి వారి సేవలు వినియోగించుకోవాలి. భవిష్యత్తులో ముంబయి ఇండియన్స్‌ లాంటి జట్ల సహాయం కూడా తీసుకుంటాం. దీనివల్ల ప్రొఫెషనలిజం బాగా పెరుగుతుంది’ అని సీఎం అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version