జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాంధీ నగర్లో దారుణం చోటుచేసుకుంది. మరోసారి హిందూ ఆలయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు చిల్లర పనులకు పాల్పడ్డారు. దొంగతనానికి వచ్చిన వారు ఆలస్యంలో చేసిన పనులు చూస్తే కొందరి మనోభావాలు దెబ్బతినక మానవు.
ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి దేవాలయంలోకి ప్రవేశించి భీబత్సం సృష్టించారు. ఆలయంలోని పలు వస్తువులను ఎత్తుకెళ్లడంతో పాటు హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే శివలింగం మీద కాలు పెట్టి వికృత చేష్టలకు ఒడిగట్టారు. అనంతరం శివలింగం మీద ఉండే నాగపడగతో పాటు మరికొన్ని వస్తువులను ఎత్తుకెళ్లారు. దీనికి సంబంధించిన సీసీ టీవీ వీడియో వైరల్ అవుతోంది.
https://twitter.com/TelanganaMaata/status/1899279497503121850