తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమల టిటిడి పాలక మండలి అన్నప్రసాద విరాళాల పైన కీలక ప్రకటన వెలువడింది. ఇప్పటివరకు అన్నప్రసాద ట్రస్టుకు 9.70 లక్షల మందికి పైగా భక్తులు విరాళాలు ఇచ్చినట్లు ప్రకటన చేసింది టీటీడీ పాలక మండలి. దీంతో టీటీడీ అన్న ప్రసాదాల విరాళాలు 2200 కోట్లకు చేరుకున్నాయి.
అలాగే హుండీ ఆదాయం కూడా ప్రతి నెల 100 కోట్లకు వస్తోందని టీటీడీ అధికారులు ప్రకటించారు. కాగా, తిరుమల లోని 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి వు ను న్నారు. దింతో టోకెన్ లేని భక్తులకు తిరుమల శ్రీవారి సర్వదర్శనంకు 12 గంటల సమయం పడుతోంది.. దింతో నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 69,746 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,649 మంది భక్తులు..నిన్న ఒక్కరోజే తలనీలాలు సమర్పించారు. తిరుమల శ్రీ వారి హుండీ ఆదాయం నిన్న ఒక్క రోజే రూ.4.27 కోట్లుగా నమోదు అయింది.