తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై మరోసారి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అసలు ఎందుకు అసెంబ్లీకి రావడం లేదని ప్రశ్నించారు సీఎం జగన్. అసెంబ్లీ రావడానికి చంద్రబాబు నాయుడుకు మొహం చేయడం లేదేమో అంటూ ఎద్దేవా చేశారు.
గవర్నర్ పై టిడిపి సభ్యులు దాడి చేసినంత పని చేశారని… రాజ్యాంగ వ్యవస్థలపై చంద్రబాబు కు కడుపు మంట ఉందని నిప్పులు చెరిగారు సీఎం జగన్. చంద్రబాబు సీఎం పీఠంపై లేరనే ఇలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు.
చంద్రబాబు చెప్పుకునేందుకు ఒక్క పథకం అయినా ఉందా అని నిలదీశారు. చంద్రబాబు అంటే గుర్తుకు వచ్చేది వెన్నుపోటు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్. చంద్రబాబు వాగ్దానాలకు ఆయన ఇచ్చిన విలువ ఏంటో అని నిలదీశారు. ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు వైసిపి పార్టీ కి పట్టం కట్టారని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆఖరికి కుప్పం లోనూ ప్రజలు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశారని తెలిపారు.