ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. కేటీఆర్ ట్వీట్..!

-

అప్పుల బాధ భరించలేక సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం కొత్తపల్లిలో ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తపల్లికి చెందిన పంగ యాదగిరి(48) బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆటో కొనుగోలుకు, కుటుంబాన్ని పోషించడానికి అప్పులు ఎక్కువయ్యాయి. ఆటో నడిపినా అంతంత మాత్రంగానే ఆదాయం రావడంతో డబ్బులు సరిపోక తీవ్ర మనస్థాపానికి గురై స్వగ్రామం కొత్తపల్లిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.

ఈ ఘటన పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్  చేశారు. “ఇదేనా రేవంత్.. నువ్వు తీసుకొచ్చిన మార్పు? పైసలతో దగదగమెరిసిన చేతుల్లోకి.. పరుగుల మందుల డబ్బాలు రావడమే మార్పా? ఆదాయంతో నిండిన ఆనందమయ జీవితాల్లోకి.. ..ఆత్మహత్య ఆలోచన చొరబడటమే మార్పా? రేవంత్.. ఆటోడ్రైవర్లకు నువ్వు ఇస్తానన్న 12వేల సాయమేది? రాహుల్ గాంధీ..ఆటో వాలాలకు నీ ఆపన్నహస్తమేది? ఆటో డ్రైవర్లనే కాదు.. అన్ని వర్గాలను మోసగించారు! తెలంగాణను తడిగుడ్డతో గొంతుకోస్తున్నారు! ఇదే..ఏడాది కాలంగా తెలంగాణ చూస్తున్న మార్పు” అంటూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version