రేపు విజయవాడలో పర్యటించనున్న సీఎం జగన్

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు విజయవాడ పర్యటించనున్నారు. హయత్ ప్లేస్ హోటల్ ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరనున్నారు. పర్యాటక రంగంలో అత్యంత కీలకమైనటువంటి స్టార్ హీటల్స్ స్థాపనలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హయత్ ప్లేస్ విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన ఫోర్త్ స్టార్ హోటల్ ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

విజయవాడ ఏలూరు రోడ్డు గుణదల ఈఎస్ఐ ఆసుపత్రి సెంటర్ సమీపంలో నూతనంగా నిర్మించిన హయత్ ప్లేస్ ఫోర్త్ స్టార్ హోటల్ ని అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో మూడు హయత్ ప్లేస్ గ్రూపు హోటల్ లను దిగ్విజయం గా నిర్వహిస్తూ పర్యాటకుల అభిమానాన్ని చూరగొంటున్నామని హోటల్ హయత్ ప్లేస్ చైర్మన్ రామిశెట్టి వీరస్వామి తెలిపారు. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా విజయవాడ నగరంలో హయత్ ప్లేస్ హోటల్ ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సీఎం జగన్ ఆగస్టు 18న ఉదయం 11 గంటలకు హయత్ ప్లేస్ ను ప్రారంభించనున్నారు. హోటల్ ప్రారంభోత్సవానికి మంత్రులు, శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, హోటల్స్ రంగానికి చెందిన ప్రముఖులు హాజరు అవుతున్నట్టు రామిశెట్టి వీరస్వాతి తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version